8వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

           నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బీసీ బాయ్స్ హాస్టల్‌లో ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేశాడు. నిర్మల్ జిల్లా లింబాకే గ్రామానికి చెందిన శివప్రసాద్.. సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ రాస్తానంటే.. పిన తల్లి తిరస్కరించింది. దీంతో మనస్తాపానికి గురై ఎలుకల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు.. స్థానికుల సహాయంతో నవీపేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం […]

Update: 2020-02-05 05:38 GMT

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బీసీ బాయ్స్ హాస్టల్‌లో ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేశాడు. నిర్మల్ జిల్లా లింబాకే గ్రామానికి చెందిన శివప్రసాద్.. సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ రాస్తానంటే.. పిన తల్లి తిరస్కరించింది. దీంతో మనస్తాపానికి గురై ఎలుకల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు.. స్థానికుల సహాయంతో నవీపేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఏరియా ఆస్పత్రికి పంపించారు.

Tags:    

Similar News