రైతు బంధు ఎవరికి ఇవ్వాలి?

To whom should the Raitu Bandu will be given?

Update: 2024-02-13 00:15 GMT

దేశానికి అన్నం పెట్టే రైతన్నను అనుకోవాల్సిందే. అయితే, రైతు బంధు ఎవ్వరికీ ఇవ్వాలి, ఎవరికీ ఇవ్వవద్దు అని చర్చలు జరుగుతున్నవి. రైతుకు సాయం చేయాలంటే పండిన పంట భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పండించే వారు (భూమి యజమాని, రైతు, కౌలురైతు) పండిస్తున్న ప్రతి ఎకరాకు రైతు బంధు ఇవ్వడం సమంజసం. అలాగే ఈ స్కీమ్ నుండి నుండి ఎమ్మెల్యే లను, ఎంపీలను రాజకీయ లబ్ధి పొందిన వారిని తొలగించాలి. అలాగే సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక్కరి పేరు మీద 54 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా, వారిని తొలగించాలి.

ధరణి భూమి ఉన్న వాన్ని లేని వాడిని చేసింది భూమి లేని వాన్ని ఉన్న వాడిని చేసింది, ప్రభుత్వ భూమిని ప్రవేట్ భూమిగా మార్చింది. ప్రవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చింది. ఇలా ఎన్నో భూ సమస్యలకు కారణమైన ధరణి పోర్టల్ సాప్ట్ వేర్ నిర్వహిస్తున్న విదేశీ సంస్థ ( terracis technology owned by Quantela,USA) కు కాంట్రాక్టు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఐటీ సంస్థ అయిన NIC కి ఇచ్చి ధరణీ పోర్టల్ లో ఉన్న లోపాలను సరిదిద్దాలి. ధరణి వలన భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలి.

తెలంగాణలో కోటి యాభై మూడు లక్షల ఎకరాలు పది లక్షల ఎకరాలకు ఇప్పటికీ పాస్ బుక్స్ రాలేదు, రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల జాబితాలో అంటే 22A లో ప్రైవేట్ భూమి పెట్టడం వలన పది లక్షల మంది రైతులు ఇబ్బంది పడుచున్నారు. ఆ సమస్యలన్నింటిని తీర్చాలి.

కౌలు రైతులకూ.. రైతు బంధు

తెలంగాణలో సుమారు 20 లక్షల మంది కౌలు రైతులు ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య మారుతుంది. వీరు ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందడం లేదు, వీరు భూమి ఉన్న వ్యక్తికి కౌలు చెల్లిస్తారు పంటకు పెట్టుబడి పెడతారు శ్రమకు తగిన ఫలితం మాత్రం పొందడం లేదన్నది నిజం, కరువు కాటకాలు వచ్చి పంట నష్ట పోతే పెద్దగా పరిహారం అందడం లేదు, వీరి శ్రమకు తగిన న్యాయం జరగాలి ప్రతి సంవత్సరమూ మండలాల వారీగా రెవెన్యూ అధికారులు కౌలు రైతుల సంఖ్య ను కౌలు భూమిని లెక్కించాలి అప్పుడు వారికి ప్రభుత్వం ఇస్తానన్న లబ్ధి పొందుతారు 15 రోజులలో వీరి సంఖ్యను కౌలు భూమి ఎకరాల వారీగా గుర్తించి వారికి సహాయం చేయాలి.

నారగోని ప్రవీణ్ కుమార్

తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

98490 40195

Tags:    

Similar News