విద్య ఓ ఉరితాడు

poem

Update: 2023-05-25 22:15 GMT

కొలమానం లేని విద్యలు

జ్ఞానం లేని ర్యాంకులు

ఉపయోగం లేని మార్కులు

చిన్ని మేధస్సుపై చెరగని తూట్లు

పసి హృదయాల పై

మానని గాయాలు....!

విద్యా వ్యవస్థే...?

ఓ ప్రాథమిక సమస్య

వ్యక్తిత్వాన్ని నిర్మించలేని

విద్య బోధనలు

మలుపు మలుపుగా

మనసు మేధస్సును

అనుభవాలు, అనుభూతులు

నేర్వని పాఠాలు....!

ఒత్తిడి భారమైన విద్యలు

ర్యాంకులు చేసే గారడీలు

బలైపోతున్న బాల్యము....!

విద్యను అభ్యసించు

అవరోధాలను అధిగమించు

ఒడిదుడుకుల సమరంలో

ఓడిపోయినంత మాత్రాన

జీవితం ఆగిపోదు

మరో అవకాశం కై

ఆకాశమే హద్దుగా సాగిపో..!!

మోహన్

హెచ్‌సీయూ

8790668849

Tags:    

Similar News