అగ్ని ప్రమాదాలను అరికట్టాలి.

Fire hazards should be prevented.

Update: 2023-01-23 18:30 GMT

హైదరాబాద్ నగరం విస్తరించక ముందు, నగరం చుట్టూరా రసాయనిక, ప్లాస్టిక్, ఫార్మా కంపెనీలు ఏర్పడి ఎంతో మందికి ఉపాధి కల్పించాయి. ఆయా పరిశ్రమలలో పనిచేసే కార్మికులు దగ్గరలో నివాసం ఏర్పరచుకొని నివసించారు అలా నగరం మొత్తం విస్తరించింది. ఇలా విస్తరించి ఇప్పుడు దేశంలోనే ఐదవ పెద్ద నగరంగా పేరు ప్రఖ్యాతులతో పాటు అగ్ని ప్రమాదాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు నగరంలోనే ఫార్మా కంపెనీలు, వాణిజ్య సముదాయాలు, గోదాములు, హోటళ్ల వంటివి ఉండటంతో ఈ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. 2019 జనవరి 30న నాంపల్లి నుమాయుష్ అగ్నిప్రమాదం, మూడు సంవత్సరాల క్రితం మైలారుదేవ్‌పల్లి పారిశ్రామికవాడలో జరిగిన దుర్ఘటన, గత ఏడాది సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ యార్డ్ ఘటన, అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద రూబీ లాడ్జిలో జరిగిన ఘటన, మొన్న మినిస్టర్ రోడ్ డెక్కన్ స్ట్పోర్ట్స్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదాలను చూస్తే భవన నిర్మాణ యజమానుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడింది. ప్రభుత్వాలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగిన ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ అంటూ చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఈ ఘటనలో ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం కనబడుతుంది. చిన్న పొగ రాగానే ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అలారం వ్యవస్థ పనిచేయకపోవడంతో ఎక్కువ ప్రమాదం జరిగింది. అలాగే అక్కడ అగ్నిమాపక సిబ్బంది కంటే ముందు మంటలు ఆర్పే యంత్రాలు లేకపోవడం, అక్కడ పనిచేసే కార్మికులకు మంటలు ఆర్పేందుకు సరైన శిక్షణ లేకపోవడం, విద్యుత్ పరికరాల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

అందుకే పెద్ద పెద్ద భవనాలు నిర్మించే ముందు అందంగా ఉండేందుకు అద్దాలు లేకుండా గాలి వెలుతురు ప్రసరించే కిటికీలు ఉంచాలి. భవన సముదాయాలు, పరిశ్రమల వద్ద నీటి తొట్టిలు నిర్మించాలి. అధిక విద్యుత్ వస్తే వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా సర్య్కూట్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. పరిశ్రమ, గోదాంలలో వాణిజ్య సముదాయాలలో పనిచేసే కార్మికులను అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించాలి. అగ్నిమాపక సాధనాలను నిర్ణీత గడువులో పర్యవేక్షణ చేస్తుండాలి. తరచూ ప్రమాదాలకు గురయ్యే పరిశ్రమల నుంచి ప్రజలు దూర ప్రాంతాలకు తరలించాలి. ప్రమాదాలు జరగకముందే లోటుపాట్లు సవరించి ప్రజలను రక్షించాలి.

ఆళవందార్ వేణు మాధవ్

8686051752

ఇది కూడా చదవండి.....

మేడ్చల్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. మద్యం దుకాణంలో చోరీ 


Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News