‘ఉచిత టీకా’ కోడ్ ఉల్లంఘన కాదు: ఈసీ

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఉచిత టీకా హామీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే దాఖలు చేసిన సందేహానికి సమాధానమిస్తూ ఎన్నికల సంఘం ఈ మేరకు వెల్లడించింది. బీజేపీ హామీలో ఉల్లంఘన కనిపించలేదని, పౌరుల సంక్షేమానికి రాష్ట్రాలు కార్యక్రమాలు రూపొందిస్తాయని, అలాంటి పథకాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచడం కోడ్ ఉల్లంఘన కాబోదని వివరించింది. అమలుకు సాధ్యపడే హామీలతో ఓట్లను పొందాలనకోవడంలో తప్పేమీ లేదని […]

Update: 2020-10-31 05:12 GMT

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఉచిత టీకా హామీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే దాఖలు చేసిన సందేహానికి సమాధానమిస్తూ ఎన్నికల సంఘం ఈ మేరకు వెల్లడించింది. బీజేపీ హామీలో ఉల్లంఘన కనిపించలేదని, పౌరుల సంక్షేమానికి రాష్ట్రాలు కార్యక్రమాలు రూపొందిస్తాయని, అలాంటి పథకాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచడం కోడ్ ఉల్లంఘన కాబోదని వివరించింది. అమలుకు సాధ్యపడే హామీలతో ఓట్లను పొందాలనకోవడంలో తప్పేమీ లేదని ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉటంకిస్తూ పేర్కొంది. కానీ, ఆ హామీని కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక్క రాష్ట్రానికే ప్రకటించిందన్న విషయాన్ని ఈసీ గుర్తించలేదని గోఖలే తర్వాత ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News