ఆగస్టులో Eamcet ప్రవేశ పరీక్ష..

దిశ, వెబ్‌‌డెస్క్ : కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను మరోసారి రీ షెడ్యూల్ చేశారు. ఇప్పటికే వేసవి సెలవులను మరోసారి పొడిగించిన ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎంట్రన్ ఎగ్జామ్స్ తేదీలను రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. ఎంసెట్ (Eamcet) సహా మరో మూడు ప్రవేశ పరీక్షా తేదీలను ఆగస్టు నెలకు రీ షెడ్యూల్ చేసినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వ ఆమోదానికి పంపించినట్లు బుధవారం వెల్లడించింది. […]

Update: 2021-06-16 08:31 GMT

దిశ, వెబ్‌‌డెస్క్ : కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను మరోసారి రీ షెడ్యూల్ చేశారు. ఇప్పటికే వేసవి సెలవులను మరోసారి పొడిగించిన ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎంట్రన్ ఎగ్జామ్స్ తేదీలను రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. ఎంసెట్ (Eamcet) సహా మరో మూడు ప్రవేశ పరీక్షా తేదీలను ఆగస్టు నెలకు రీ షెడ్యూల్ చేసినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వ ఆమోదానికి పంపించినట్లు బుధవారం వెల్లడించింది. జూన్ నెలలో అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. సమీప కాలంలోనే థర్డ్ వేవ్ పొంచియున్నదని కథనాలు వస్తుండటంతో నాలుగు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తేదీలను రీ షెడ్యూల్ చేసినట్లు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

Tags:    

Similar News