2 వర్గాల ఘర్షణ… పోలీసుల లాఠీ ఛార్జ్ 

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుండి కొనసాగుతోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో జనాలు క్యూలైన్లో గంటలతరబడి వేచి చూస్తున్నారు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాలవద్ద ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఉద్రిక్త వాతావరణాన్ని అదుపు చేసేందుకు పోలీసులు ఇరు వర్గాల వారిపై లాఠీ ఛార్జ్ […]

Update: 2020-11-03 01:31 GMT

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుండి కొనసాగుతోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో జనాలు క్యూలైన్లో గంటలతరబడి వేచి చూస్తున్నారు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాలవద్ద ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఉద్రిక్త వాతావరణాన్ని అదుపు చేసేందుకు పోలీసులు ఇరు వర్గాల వారిపై లాఠీ ఛార్జ్ చేశారు.

Tags:    

Similar News