కానిస్టేబుల్‌తో డీఎస్పీ రాసలీలలు.. చిన్నారి ముందే సిగ్గులేకుండా.. వీడియో వైరల్

దిశ, వెబ్‌డెస్క్: అతనో పోలీస్ ఉన్నతాధికారి.. ఎంతోమంది పోలీసులకు స్ఫూర్తిగా ఉండాల్సిన అతను కామక్రీడల్లో మునిగితేలాడు. కామంతో కళ్లు మూసుకుపోయి, విచక్షణ మరిచి చిన్నారి ముందే  రాసలీలలు కొనసాగించాడు. అందులోనూ ఒక మహిళా కానిస్టేబుల్ తో స్విమ్మింగ్ పూల్ లో అసభ్యరీతిలో, అభ్యంతరకరంగా ప్రకవర్తించాడు.  డీఎస్పీ స్విమ్మింగ్‌పూల్లో చేసిన రచ్చ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో.. ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని […]

Update: 2021-09-11 02:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: అతనో పోలీస్ ఉన్నతాధికారి.. ఎంతోమంది పోలీసులకు స్ఫూర్తిగా ఉండాల్సిన అతను కామక్రీడల్లో మునిగితేలాడు. కామంతో కళ్లు మూసుకుపోయి, విచక్షణ మరిచి చిన్నారి ముందే రాసలీలలు కొనసాగించాడు. అందులోనూ ఒక మహిళా కానిస్టేబుల్ తో స్విమ్మింగ్ పూల్ లో అసభ్యరీతిలో, అభ్యంతరకరంగా ప్రకవర్తించాడు. డీఎస్పీ స్విమ్మింగ్‌పూల్లో చేసిన రచ్చ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో.. ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఓ రిసార్టుపై గత అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దాడి చేసింది. ఆ దాడిలో డీఎస్పీ హీరాలాల్ సైనీ, మరో మహిళా కానిస్టేబుల్‌ అడ్డంగా దొరికిపోయారు. స్విమ్మింగ్ పూల్ లో డీఎస్పీ హీరాలాల్ సైనీ, మహిళా కానిస్టేబుల్ అర్ధనగ్నంగా సరస సల్లాపాల్లో మునిగితేలారు. వారితో పాటు మహిళ కుమార్తె ఆరేళ్ళ చిన్నారి కూడా ఉంది. చిన్నారి ఉందన్న విచక్షణ కూడా మరిచి డీఎస్పీ, ఆ మహిళా కానిస్టేబుల్ తో రాసలీలలు కొనసాగించాడు.

వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో పోలీసులు స్వయం ప్రతిపత్తిని తీసుకుని, సైనీని అరెస్ట్ చేశామని, మహిళ తన కుమార్తెతో ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఇక శనివారం వీరిద్దరి మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపిన డీఎస్పీ అరెస్ట్‌ను ఏడీజీ అశోక్ రాథోడ్ దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపోతే సదరు డీఎస్పీ అజ్మేర్ జిల్లాలో పనిచేస్తుండగా.. మహిళా కానిస్టేబుల్‌.. జైపూర్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News