డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎత్తివేయాలి

దిశ, హైదరాబాద్ రాష్ట్రంలో కరోనా తగ్గేంత వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఒకే స్ట్రాతో ఇద్దరు, ముగ్గురు వాహనదారులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీని ద్వారా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ఈ అంశంపై హోంమంత్రి మహమూద్ అలీ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే చెప్పిన […]

Update: 2020-03-12 05:24 GMT

దిశ, హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా తగ్గేంత వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఒకే స్ట్రాతో ఇద్దరు, ముగ్గురు వాహనదారులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీని ద్వారా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ఈ అంశంపై హోంమంత్రి మహమూద్ అలీ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే చెప్పిన విషయంపై ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు.

Tags: assembly session,ibrahimpatnam mla manchireddy kishan reddy, stop drunk test, Until the corona virus is over

Tags:    

Similar News