అసలెవరీ డాలర్ బాబు..

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచారం ఘటనపై నగర పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. తనపై 139 మంది అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, పలుమార్లు కులం పేరుతో దూషించారంటూ ఓ బాధిత యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పలు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అంతకంటే ముందు అత్యాచారం కేసులో 139 మంది వ్యక్తుల పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే డాలర్ బాయ్ అనే […]

Update: 2020-08-28 04:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచారం ఘటనపై నగర పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. తనపై 139 మంది అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, పలుమార్లు కులం పేరుతో దూషించారంటూ ఓ బాధిత యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పలు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.

అంతకంటే ముందు అత్యాచారం కేసులో 139 మంది వ్యక్తుల పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే డాలర్ బాయ్ అనే వ్యక్తి బాధితురాలని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తేలింది. ఆమెతో పాటు ఇతరులను కూడా డాలర్ బాయ్ ఫోన్లు చేసి బెదిరించినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో డాలర్‌ బాయ్‌, డిటెక్టివ్‌ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలుజిల్లాల్లో డాలర్‌ బాయ్‌ అరాచకాలపై బాధితులు ఫిర్యాదు చేసినట్లు పలు పోలీస్‌స్టేషన్లలో రికార్డులు ఉన్నట్లు పంజాగుట్టు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ ప్రదీప్ నిన్న స్పందించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News