వైద్యుల నిర్లక్ష్యానికి బలైన బాలింత

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వైద్యసేవలు సక్రమంగా అందక ఓ బాలింత మృతి చెందిన సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో ప్రసవం కోసం ఓ మహిళ ఈ నెల 22న చేరింది. ఆపరేషన్ చేసి శిశువును క్షేమంగా బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత సిబ్బంది సరైన వైద్య సేవలు అందించకపోవడంతో ఆ బాలింతకు గురువారం రక్త స్రావం ఎక్కువగా జరిగి కోమా లోకి వెళ్ళింది. పరిస్థితి చేయి […]

Update: 2021-06-24 11:05 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వైద్యసేవలు సక్రమంగా అందక ఓ బాలింత మృతి చెందిన సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో ప్రసవం కోసం ఓ మహిళ ఈ నెల 22న చేరింది. ఆపరేషన్ చేసి శిశువును క్షేమంగా బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత సిబ్బంది సరైన వైద్య సేవలు అందించకపోవడంతో ఆ బాలింతకు గురువారం రక్త స్రావం ఎక్కువగా జరిగి కోమా లోకి వెళ్ళింది. పరిస్థితి చేయి దాటి తర్వాత వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నించగా ఆమె అప్పటికే మరణించినట్లు గుర్తించారు. సరైన వైద్య సేవలు అందించకపోవడం వల్లే తన భార్య మరణించిందని భర్తతోపాటు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దాదాపు గంట సేపు ఆస్పత్రి వద్ద ఆందోళన చేయడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.

Tags:    

Similar News