బయటకొస్తే కేసులే: ఎస్పీ

దిశ, మహబూబ్‌నగర్: కంటైన్మెంట్ జోన్‌లలోని ప్రజలు రోడ్ల మీదకు వస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా ఇంఛార్జి ఎస్పీ అపూర్వరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గద్వాల పట్టణంలోని మోమిన్ మహలా, గంజిపేట, వేదానగర్, హౌసింగ్ బోర్డు, బీంనగర్ ప్రాంతాల్లో అపూర్వరావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఇండ్ల వద్దకు వెళ్లి లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు […]

Update: 2020-04-20 03:04 GMT

దిశ, మహబూబ్‌నగర్: కంటైన్మెంట్ జోన్‌లలోని ప్రజలు రోడ్ల మీదకు వస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా ఇంఛార్జి ఎస్పీ అపూర్వరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గద్వాల పట్టణంలోని మోమిన్ మహలా, గంజిపేట, వేదానగర్, హౌసింగ్ బోర్డు, బీంనగర్ ప్రాంతాల్లో అపూర్వరావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఇండ్ల వద్దకు వెళ్లి లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరాదీశారు. అలాగే, నిత్యావసర సరుకులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, పాలు, నీళ్లు ఇంటి వద్దకే వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

tags : District additional SP, educating, public, Corona, red zone, lockdown

Tags:    

Similar News