సరుకులు అందజేసిన వీహెచ్‌పీ

దిశ, న్యూస్‌బ్యూరో: విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో పదో రోజూ సరుకులు పంపిణీ చేశారు. ఆదివారం లబ్ధిదారులకు పంచేందుకు కాచిగూడలో కూరగాయలు కొనుగోలు చేశారు. దాతల సహకారంతో సుమారు రూ.30 వేల విలువ చేసే కూరగాయలను సేకరించారు. విశ్వహిందూ పరిషత్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి సహాయంతో 160 అన్నం ప్యాకెట్లను ఏబీవీపీ ఆఫీస్ వద్ద అందజేశారు. అనంతరం ఓల్డ్ సిటీలోని దూద్‌బౌలి, కామాటిపుర, చార్మినార్, విద్యానగర్‌లలో మూడు క్వింటాళ్ల బియ్యం, పప్పు లబ్ధిదారులకు అందజేశారు. వీహెచ్‌పీ […]

Update: 2020-04-06 07:33 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో పదో రోజూ సరుకులు పంపిణీ చేశారు. ఆదివారం లబ్ధిదారులకు పంచేందుకు కాచిగూడలో కూరగాయలు కొనుగోలు చేశారు. దాతల సహకారంతో సుమారు రూ.30 వేల విలువ చేసే కూరగాయలను సేకరించారు. విశ్వహిందూ పరిషత్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి సహాయంతో 160 అన్నం ప్యాకెట్లను ఏబీవీపీ ఆఫీస్ వద్ద అందజేశారు. అనంతరం ఓల్డ్ సిటీలోని దూద్‌బౌలి, కామాటిపుర, చార్మినార్, విద్యానగర్‌లలో మూడు క్వింటాళ్ల బియ్యం, పప్పు లబ్ధిదారులకు అందజేశారు. వీహెచ్‌పీ ఫోన్ నంబర్‌కు వస్తున్న కాల్స్ ఆధారంగా సరుకులు అందజేస్తున్నారు. కార్యక్రమంలో వీహె‌చ్‌పీ రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ బాలస్వామి, భజరంగ్ దళ్ రాష్ట్ర కో-కన్వీనర్‌లు శివరాములు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags: ABVP and VHP, Distribution Hyderabad, Kachiguda, Charminar, Vidyanagar

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News