బాలుడి ఆచూకీ లభ్యం

          నాలుగు రోజుల క్రితం మేడారం జాతరలో అదృశ్యమైన పెద్దపల్లి జిల్లాకు చెందిన బాలుడు మిన్నూ ఆచూకీ సోమవారం లభ్యమైంది. భువనగిరి బస్టాండ్‌లో బాలుడిని గుర్తించిన స్థానికులు.. వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నారం గ్రామానికి చెందిన దంపతులు, తమ కొడుకు మిన్నూతో మేడారం జాతరకు రాగా, జాతరలో ఆడుకుంటూ మిన్నూ అదృశ్యమైన సంగతి తెలిసిందే. కిడ్నాపర్లు బాలుడిని భువనగిరి బస్టాండ్‌లో వదిలి వెళ్లినట్టు […]

Update: 2020-02-10 07:17 GMT

నాలుగు రోజుల క్రితం మేడారం జాతరలో అదృశ్యమైన పెద్దపల్లి జిల్లాకు చెందిన బాలుడు మిన్నూ ఆచూకీ సోమవారం లభ్యమైంది. భువనగిరి బస్టాండ్‌లో బాలుడిని గుర్తించిన స్థానికులు.. వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నారం గ్రామానికి చెందిన దంపతులు, తమ కొడుకు మిన్నూతో మేడారం జాతరకు రాగా, జాతరలో ఆడుకుంటూ మిన్నూ అదృశ్యమైన సంగతి తెలిసిందే. కిడ్నాపర్లు బాలుడిని భువనగిరి బస్టాండ్‌లో వదిలి వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News