కలర్ ఫొటో నా సొంత కథే : డైరెక్టర్

కలర్ ఫొటో.. సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ డైరెక్టర్. ఈ మధ్యే సినిమా టీజర్ కూడా రిలీజై ఆకట్టుకుంది. అంతగా కలర్ లేని అబ్బాయి, ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడితే.. తను లవ్‌ను యాక్సెప్ట్ చేయకపోతే.. జీవితంలో ఆ అబ్బాయికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేది సినిమా కథ కాగా, ఇందులో జాతి వివక్ష అనే అంశం కూడా ఉంటుందని టాక్. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్.. […]

Update: 2020-08-10 08:17 GMT

కలర్ ఫొటో.. సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ డైరెక్టర్. ఈ మధ్యే సినిమా టీజర్ కూడా రిలీజై ఆకట్టుకుంది. అంతగా కలర్ లేని అబ్బాయి, ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడితే.. తను లవ్‌ను యాక్సెప్ట్ చేయకపోతే.. జీవితంలో ఆ అబ్బాయికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేది సినిమా కథ కాగా, ఇందులో జాతి వివక్ష అనే అంశం కూడా ఉంటుందని టాక్.

అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్.. కలర్ ఫొటో సినిమా నా సొంత కథే అని తెలిపాడు. తన కథ నుంచి ప్రేరణ పొందే ఈ సినిమా స్టోరీ డెవెలప్ చేసినట్లు తెలిపిన ఆయన.. సినిమాలో సుహాస్ నటనకు ఫిదా అయిపోవటం ఖాయమన్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సుహాస్ చుట్టే తిరుగుతుందని తెలిపారు. ఇక సినిమాలో హీరో కమ్ కమెడియన్ అయిన సునీల్ విలన్‌గా నటిస్తున్నారు.

Tags:    

Similar News