ఆన్‌లైన్ పాఠాల్లో ధోనీ, అశ్విన్ బిజీ !

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో విద్యాసంస్థలు సహా పలు క్రీడా అకాడమీలు Online lessons, MS Dhoni, Ashwin, Game Practice, Coaching Academy Online lessons, MS Dhoni, Ashwin, Game Practice, Coaching Academy మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో యువ క్రీడాకారులకు సరైన గైడెన్స్ లేకుండా పోయింది. కానీ, ఇప్పటికీ కొంత మంది క్రీడాకారులు అకాడమీల్లోనే తలదాచుకుంటున్నారు. ఇండ్లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అక్కడే లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ గేమ్ […]

Update: 2020-04-10 23:31 GMT

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో విద్యాసంస్థలు సహా పలు క్రీడా అకాడమీలు Online lessons, MS Dhoni, Ashwin, Game Practice, Coaching Academy Online lessons, MS Dhoni, Ashwin, Game Practice, Coaching Academy మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో యువ క్రీడాకారులకు సరైన గైడెన్స్ లేకుండా పోయింది. కానీ, ఇప్పటికీ కొంత మంది క్రీడాకారులు అకాడమీల్లోనే తలదాచుకుంటున్నారు. ఇండ్లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అక్కడే లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, అక్కడ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నారు.

ఎంఎస్ ధోనీ, అశ్విన్‌లు తమ అకాడమీల్లో శిక్షణ పొందుతున్న యువకులకు వినూత్న పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. కోచ్‌లకు ఆన్‌లైన్‌లో సూచనలు చేయడంతో.. వారు ఆ సూచనలు, సలహాలను క్రీడాకారులకు నేర్పిస్తున్నారు. క్రికెట్‌లో మెళకువలతో పాటు ఫిట్‌నెస్ సంబంధిత అంశాలను కూడా వివరిస్తున్నారు. ఇక అశ్విన్ ఒక్కోసారి క్రీడాకారులతోనే ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. లాక్‌డౌన్ సమయాన్ని వీరిద్దరూ ఇలా ఉపయోగించుకోవడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags: Online lessons, MS Dhoni, Ashwin, Game Practice, Coaching Academy

Tags:    

Similar News