సహాయక చర్యలపై డీజీపీ పర్యవేక్షణ..

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల వలన పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం పలు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, తలసాని, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియొద్దీన్ పర్యటించి రక్షణ చర్యలపై ఆరా తీశారు.ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు. జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఫోన్ చేసి మాట్లాడారు. మరో రెండ్రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని […]

Update: 2020-10-14 03:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల వలన పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం పలు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, తలసాని, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియొద్దీన్ పర్యటించి రక్షణ చర్యలపై ఆరా తీశారు.ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు.

జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఫోన్ చేసి మాట్లాడారు. మరో రెండ్రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని.. అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని పోలీసులకు మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

Tags:    

Similar News