మానవ నిర్మాణాన్ని తలపించే ఆలయం ఎక్కడుంది ? దాని ప్రత్యేకత ఏంటి?

ఆధ్యాత్మికత అంటే గుర్తుకు వచ్చేది భారతదేశం. వేదకాలం నుంచే దేశంలో ఆలయాలు నిర్మిస్తూ వస్తున్నారు.

Update: 2024-03-16 15:39 GMT

దిశ, ఫీచర్స్ : ఆధ్యాత్మికత అంటే గుర్తుకు వచ్చేది భారతదేశం. వేదకాలం నుంచే దేశంలో ఆలయాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, సంప్రదాయం ఉంటుంది. దానికి అనుగుణంగా ఆలయాలను నిర్మిస్తూ వస్తున్నారు. సాధారణంగా ఉండే ఆలయాల కంటే భిన్నంగా ఉండే దేవాలయాలు భక్తులను ఆకట్టుకుంటుంటాయి. అటువంటి వాటిల్లో ఒకటి పశ్చిమబెంగాల్‌లోని హంగేశ్వరి దేవాలయం. తాంత్రిక సూత్రాల ఆధారంగా హంగేశ్వరి దేవి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

పశ్చిమ బెంగాల్‌ అంటే గుర్తుకు వచ్చేది దుర్గాదేవి. అక్కడి ప్రజలు దుర్గామాతను తమ దైవంగా కొలుస్తారు. బెంగాల్‌ రాష్ట్రంలో వందలాది అమ్మవారి ఆలయాలున్నాయి. వివిధ పేర్లతో అమ్మవారిని పూజిస్తుంటారు. దసరా వచ్చిందంటే అక్కడ చాలు అక్కడ సందడే. దుర్గాదేవి అవతారంగా చెప్పబడే కాళీమాతను తాంత్రిక దేవతగా కొలుస్తారు. కాళీ అమ్మవారికి ఆ రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలున్నాయి. అందులో ఒకటి హంగేశ్వరీ దేవాలయం. ఇది హుగ్లీ జిల్లాలోని బెన్సి బెరియాలో ఉంది. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని హంగేశ్వరీ లేదా హంసేశ్వరిగా కూడా పిలుస్తారు. కాళీమాతకు ఈ ఆలయం అంకితం చేయబడింది. 19వ శతాబ్దంలోని శిల్పకళ మనకు ఇక్కడ కనిపిస్తుంది.

Tags:    

Similar News