Tirumala : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్

తిరుమలలో ఇటీవల సెలవులు కావడంతో రద్దీ భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

Update: 2023-10-08 03:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో ఇటీవల సెలవులు కావడంతో రద్దీ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గత రెండు రోజుల నుంచి రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులు 5 గంటల్లోనే శ్రీవారి సర్వ దర్శనం చేసుకోవచ్చు. కంపార్ట్‌మెంట్లలో రద్దీ అంతంతమాత్రంగానే ఉంది. కాగా నిన్న శ్రీవారిని 72, 309 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.50 కోట్లు వచ్చాయి. అలాగే 26,296 మంది తలనీలాలు సమర్పించారు.

Tags:    

Similar News