ఈ ఆచారాలు గురించి ఎప్పుడైనా విన్నారా ?

11 వ నెలలో కానీ లేదా 3 వ యేడు కానీ తీయవలెను. పిల్లలకు అన్నప్రాసన ఆరవ నెలలో చేయాలి.

Update: 2023-02-09 03:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : మానవులు పుట్టిన తరవాత నిత్యం ఆచరించాలిసిన ధర్మాలు , ఆచారాలు గురించి ఇక్కడ చూద్దాం. పుట్టిన తరవాత పిల్లలకు తల వెంట్రుకలు 9 నెలలో కానీ , 11 వ నెలలో కానీ లేదా 3 వ యేడు కానీ తీయవలెను. పిల్లలకు అన్నప్రాసన ఆరవ నెలలో చేయాలి. ఆడపిల్లలకు అయితే 5 వ నెలలో తీయాలి. ద్వారానికి పై నున్న కమ్మి లక్ష్మి స్వరూపం. అందుకే దానికి మామిడి తోరణం కడుతారు. కింద కమ్మి పవిత్రమైనది కనుక దానికి పసుపు రాస్తారు. గుడిలో తీర్ధాన్ని మూడు సార్లు తీసుకోవడానికి అర్ధం ఏమిటంటే తొలి తీర్ధం శరీర శుద్ధికి, రెండొవ తీర్ధం ధర్మ న్యాయం ప్రవర్తనకు, మూడో తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కొరకు.. తీర్ధం తీసుకునేటప్పుడు అకాల మృత్యు మరణం , సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపి వినాశనం , అని మంత్రం చెప్పుకోవడం మంచిదట. నదిలో స్నానం చేసేటప్పుడు ప్రవాహానికి ఎదురుగా పురుషులు , వాలుగా స్త్రీలు స్నానం చేయలట. నదుల్లో స్నానం చేసే టప్పుడు మట్టిని మూడు సార్లు లోపలి వేయవలెను.. ఎందుకంటే అవి ఎప్పటికి స్థిరంగా ఉండటం కోసం అలా చేయాలట. 

ఇవి కూడా చదవండి : పిల్లల ముందు ఈ పనులను అస్సలు చేయకండి ?

Tags:    

Similar News