సూర్యాస్తమయం సమయంలో పొరపాటున ఈ పనులు చేయకండి.. సమస్యలు పెరుగుతాయి !

హిందూ మతంలో ప్రజలకు ఎన్నో నమ్మకాలు, ఉంటాయి.

Update: 2024-05-01 09:11 GMT

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో ప్రజలకు ఎన్నో నమ్మకాలు, ఉంటాయి. ఏ పనిచేయాలన్నా మూహూర్తాలను, సమయాన్ని చూసి చేస్తుంటారు. అలా చేసి ఆనందాన్ని, శ్రేయస్సును పొందుతారు. అయితే సాయంత్రం పూట మాత్రం కొన్ని పనులు చేయకూడదని చెబుతుంటారు. ఎవరైనా కొన్ని పనులను తెలిసీ తెలియకుండా చేస్తే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి, శ్రేయస్సు, ఆనందం కూడా పోతుందని చెబుతారు. అయితే ఎవరైనా తమ ఇంటిలో సుఖసంతోషాలు తులతూగాలని, ఆర్థిక ఇబ్బందులు రాకూడదని కోరుకుంటారు. సంపాదించేందుకు ఎంతో కష్టపడతారు. కానీ ఎంత కష్టపడి పనిచేసినా, శుభఫలితాలు లభించవు.

సూర్యాస్తమయం కాలంలో నాలుగు పనులు చేయకూడదని మతగ్రంథాలలో చెప్పారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాయంకాల సమయంలో ఆహారం తినకూడదు. అలా తింటే పూర్వజన్మలో జంతువు రూపంలో జన్మిస్తారని చెబుతారు. అలాగే సాయంకాలం వేల ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి నిద్రపోకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంట్లోని ధనం త్వరగా ఖర్చవుతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు.

సాయంకాలం వేళ లైంగిక కోరికను అదుపు చేసుకోవాలని చెబుతారు. ఈ సమయంలో లైంగిక కార్యక్రమాల్లో పాల్గొంటే పుట్టిన బిడ్డ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతారు. ఈ సమయంలో ధ్యానం చేయడం ఉత్తమంగా భావిస్తారు. అలాగే సూర్యాస్తమయం కాలంలో లావాదేవీలు జరపకూడదు. ఇలా చేస్తే డబ్బుల కొరత ఏర్పడుతుందని అంటారు. అలాగే గోర్లు కత్తిరించకూడదు, జుట్టును కత్తిరించకూడదు. సాయంకాలం వేళ దేవున్ని పూజిస్తే మంచిదని భావిస్తారు.


Similar News