మిరాకిల్.. ఒక్కరోజులోనే బాలిక, యువతి, వృద్ధురాలిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు..

పురాతన దేవాలయాలకు భారతదేశం ఎంతో ప్రసిద్ధిగాంచింది.

Update: 2023-07-03 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పురాతన దేవాలయాలకు భారతదేశం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో అమ్మవారి ఆలయాలు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటాయి. మన భారతదేశంలో 108 శక్తి పీఠాలు కొలువై ఉన్నాయి. అందులోని ఓ ఆలయంలోని అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, రాత్రి వృద్ధురాలిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. దీంతో పాటుగానే ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. మరి ఆలయం విశేషాలేంటి, ఆ ఆలయం ఎక్కడ ఉందో తెసుకుందాం..!

ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ధారీదేవి ఆలయం ఉంది. శ్రీనగర్‌, బద్రీనాథ్‌కు వెళ్లే మార్గంలో అలకనంద నది ఒడ్డున ఉన్న కల్యాసౌర్ గ్రామంలో అమ్మవారు వెలిశారు. గర్భగుడిలో అమ్మవారి పై సగభాగం మాత్రమే ఉంటుంది. విగ్రహం క్రింది భాగం కాళీమఠ్‌లో వుంది. ఇక్కడ ఆమెను కాళీ దేవిగా పూజిస్తారు. ఈ ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం నాటిది. ఈ ఆలయానికి పై కప్పు ఉండదు. ఉధృతంగా ప్రవహించే అలకనందా నదీ ప్రవాహాన్ని అమ్మవారి నియంత్రిస్తుందని అక్కడి భక్తుల నమ్మకం. చార్ ధామ్ క్షేత్రాలకు నాయక అయిన ధారీదేవి అమ్మవారు కాళీమాతకు మరో రూపం అని అక్కడి ప్రజలు చెబుతారు. ఈ ఆలయం గురించి దేవీ భాగవతంలో తెలిపారు. ధారీదేవి ఉత్తరాఖండ్ ప్రజల ఆరాధ్య దేవత. ఈ అమ్మవారిని ధిక్కరిస్తే కీడు జరుగుతుందని భక్తులు చెబుతున్నారు.

క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు. ఆ రాజు చేసిన అపచారంతో కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. దేవి మహత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. దీనిని ఆదిశంకరాచార్యులు స్థాపించారు. ఈ పీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది.

2013 ఉత్తరాఖండ్ వరదలు..

2013 జూన్ 16న అలకనంద హైడ్రో పవర్ కంపెనీ లిమిటెడ్ (ఎహెచ్ పీసీఎల్) నిర్మించిన 330 మెగావాట్ల అలకనంద హైడ్రో ఎలక్ట్రిక్ ఆనకట్ట నిర్మాణానికి మార్గం సుగమం చేయడానికి, అమ్మవారి మూల మందిరాన్ని తొలగించి, అలకనంద నదికి దాదాపు 611 మీటర్ల ఎత్తులో ఉన్న కాంక్రీట్ ప్లాట్‌ఫారమ్‌లోకి మార్చారు. యాదృచ్ఛికంగా, విగ్రహాన్ని తరలించిన కొన్ని గంటల తర్వాత, వర్షం ప్రారంభమయి, చాల రోజులు వర్షాలు పడి వరదలు వచ్చి కొండచరియలు విరిగి మొత్తం కొట్టుకుపోయింది. వరదల తర్వాత శిథిలావస్థకు చేరిన 330 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం దేవతను మళ్లీ తన పూర్వస్థలం నుండి మార్చారు. అలకనంద ఉగ్రరూపం దాల్చిన సమయంలో దాదాపు 10 వేలమంది మృత్యువాతపడ్డారు. ఇక ఈ ఆలయంలో అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధురాలిగా భక్తులకు దర్శనం ఇస్తుంది.

Tags:    

Similar News