మూఢాలున్నాయని టెన్షన్ పడుతున్నారా.. చింతించకండి.. ఈ శుభకార్యాలు చేసుకోవచ్చు

హిందూ సంప్రదాయం ప్రకారం, మనం ఎల్లప్పుడూ కొన్ని ఆచారాలు, పద్ధతులను అనుసరిస్తాము.

Update: 2024-04-28 02:57 GMT

దిశ, ఫీచర్స్ : హిందూ సంప్రదాయం ప్రకారం, మనం ఎల్లప్పుడూ కొన్ని ఆచారాలు, పద్ధతులను అనుసరిస్తాము. ముఖ్యంగా జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలకు గ్రహాలు, రాశులు, అనుకూల క్షణాలు తప్పకుండా చూస్తాము. దాదాపు మూడు నెలల వరకు శుభ సమయాలు లేవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మూఢంలో కూడా కొన్ని పనులు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అన్నప్రాసన: చిన్న పిల్లలకు మొదటిసారి అన్నం తినిపించడానికి ఈ వేడుక నిర్వహిస్తారు. దేవస్థానంలో కానీ తమ ఇంటి వద్ద కానీ అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొందరు బంగారు గిన్నెలో, మరికొందరు వెండి పళ్లెంలో సేకరించి పరమాన్నం లేదా పాయసం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పిల్లలకు అన్నప్రాసన చేయిస్తారు. ఈ వేడుకను మూఢంలో చేసుకోవచ్చు.

భూమిని అమ్మడం లేదా కొనడం:

కొన్నిసార్లు భూమి అకస్మాత్తుగా సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తుంది. అవసరాల కోసం ఏదైనా విక్రయిస్తాడు. ఈ సమయంలో ఇప్పుడు మూఢం ఉంది కదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో భూమిని కొనుగోలు చేసుకోవచ్చు. ఇది చెడు ప్రభావాన్ని చూపదు. భూమిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే అమ్ముకోవచ్చు.

కొత్త కారు కొనడం:

కొత్త ద్విచక్రవాహనం లేదా నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేసేవారు మూఢాలున్నాయని వేచి చూడాల్సిన అవసరం లేదు. మూఢాలున్న కూడా కొత్త కార్లు కొంటే ఆనందించవచ్చు.

విదేశీ విద్యకు వెళ్లడం:

కొందరికి ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. అలాంటి వారు మూఢాలున్నాయని ఆగాల్సిన అవసరం లేదు. మీరు సంతోషంగా ఫారెన్‌కు ప్రయాణం చేయవచ్చు. 

Similar News