శివాలయాలకు పోటెత్తిన భక్తులు

దిశ, వెబ్‎డెస్క్: నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి వారమే కార్తీక సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కార్తీక సోమవారం కావడంచేత రుద్రాభిషేకాలు, బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలను అర్చక స్వాములు నిర్వహిస్తున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివస్తున్నారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు.

Update: 2020-11-15 20:47 GMT

Tags:    

Similar News