ఈఎస్ఐ స్కాంలో కీలక ఆధారాలు దొరికాయి

దిశ, వెబ్ డెస్క్: ఈఎస్ఐ స్కాంలో కీలక ఆధారాలు దొరికాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కాంకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈఎస్ఐ స్కాంలో మొత్తం 19 మంది నిందితులపై కేసు నమోదు చేశామని, ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేశామని మరో ఏడుగురు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. త్వరలో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ ను దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. కొత్తగా మరో ముగ్గురిపై […]

Update: 2020-08-19 02:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈఎస్ఐ స్కాంలో కీలక ఆధారాలు దొరికాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కాంకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈఎస్ఐ స్కాంలో మొత్తం 19 మంది నిందితులపై కేసు నమోదు చేశామని, ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేశామని మరో ఏడుగురు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. త్వరలో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ ను దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. కొత్తగా మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేసినట్లు రవికుమార్ పేర్కొన్నారు.

2014-19 టీడీపీ హయాంలో మందులు, సర్జికల్, ల్యాబ్, మెడికల్, ఫర్నీచర్ కొనుగోలులో జరిగిన అవినీతిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, నిర్ణీత ధరలకంటే ఎక్కువగా మందులను కొన్నట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు. రూ. 106 కోట్ల విలువ చేసే మందులను నాన్ కాంట్రాక్టులో కొన్నారని, కొన్ని సంస్థలతో కుమ్మక్కై అవకతవకలు జరిపారని, ఇప్పటివరకు రూ. 150 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించామని ఆయన చెప్పారు. అదేవిధంగా మాజీ మంత్రి పితాని పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన వివరించారు.

కాగా, ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రస్తుతం బెయిల్ లో ఉన్న విషయం విధితమే.

Tags:    

Similar News