‘మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిని తరిమికొట్టండి’

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందంజలో దూసుకుపోతోంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధకు మద్దతుగా బద్వేలులో మంత్రులు, వైసీపీ నేతలు తిష్టవేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఇతర పార్టీలపై విమర్శలదాడి చేస్తున్నారు. బీజేపీకి దళితులు ఓటు వేసే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిని బద్వేలు ప్రజలు […]

Update: 2021-10-19 06:03 GMT

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందంజలో దూసుకుపోతోంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధకు మద్దతుగా బద్వేలులో మంత్రులు, వైసీపీ నేతలు తిష్టవేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఇతర పార్టీలపై విమర్శలదాడి చేస్తున్నారు. బీజేపీకి దళితులు ఓటు వేసే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిని బద్వేలు ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందని ఆయన మంత్రి పదవి కోసం వేరే పార్టీ మారారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ఆదినారాయణరెడ్డిని వదిలి పెట్టొద్దని సూచించారు. దళితులకు నాగరికత తెలియదంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారని.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దళితులను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షతో వైఎస్‌ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించిందని ధ్వజమెత్తారు. బద్వేలు ఉపఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News