జగన్​తోనే గ్రామ స్వరాజ్యం : నారాయణస్వామి

దిశ, ఏపీబ్యూరో : రాష్ట్రంలో గ్రామ స్వరాజ్య స్థాపన సీఎం జగన్​తోనే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జగన్‌కు కులం, మతం, పార్టీ లేదన్నారు. వెంకటేశ్వరస్వామి, అల్లా, యేసు ఆశీస్సులు జగన్‌కు పుష్కళంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు చంద్రబాబు ప్రేమ కురిపిస్తున్నారని మండిపడ్డారు. దళితులకు పెద్ద పీఠ వేసి […]

Update: 2020-11-13 11:07 GMT

దిశ, ఏపీబ్యూరో : రాష్ట్రంలో గ్రామ స్వరాజ్య స్థాపన సీఎం జగన్​తోనే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జగన్‌కు కులం, మతం, పార్టీ లేదన్నారు. వెంకటేశ్వరస్వామి, అల్లా, యేసు ఆశీస్సులు జగన్‌కు పుష్కళంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు చంద్రబాబు ప్రేమ కురిపిస్తున్నారని మండిపడ్డారు.

దళితులకు పెద్ద పీఠ వేసి వారి అభివృద్ధికి సీఎం జగన్ పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి బీసీలకు ఇంతవరకు ఎవరూ ఇవ్వని ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఉప ఎన్నికలో తిరుపతి లోకసభ నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని నారాయణస్వామి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News