సూర్యాపేటలో ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత కఠిన చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే సూర్యాపేట పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పాలు ఇతర సేవల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వార్డులకు ఇంచార్జీలను నియమించామని స్థానిక మున్సిపల్ కమిషనర్ రామంజులరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దనీ, ఎలాంటి అవసరం ఉన్నా.. ఆయా వార్డు పరిధిలోని […]

Update: 2020-04-18 00:10 GMT

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత కఠిన చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే సూర్యాపేట పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పాలు ఇతర సేవల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా
ఉండేందుకు వార్డులకు ఇంచార్జీలను నియమించామని స్థానిక మున్సిపల్ కమిషనర్ రామంజులరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దనీ, ఎలాంటి అవసరం ఉన్నా.. ఆయా వార్డు పరిధిలోని ఇంచార్జీలకు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు.

Tags: home Delivery, essential, commodities, Suryapet, red zone, lockdown

Tags:    

Similar News