ఢిల్లీ పోల్స్..6.28శాతం ఓటింగ్

       దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకూ 6.28శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు నిర్మాన్ భవన్ నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఔరంగజేబ్, లోధి ఎస్టేట్‌లో వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన సతీమణితో కలిసి ఓటు వేశారు. ప్రముఖ నటి తాప్సి పన్ను తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఫోటో […]

Update: 2020-02-08 01:07 GMT

దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకూ 6.28శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు నిర్మాన్ భవన్ నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఔరంగజేబ్, లోధి ఎస్టేట్‌లో వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన సతీమణితో కలిసి ఓటు వేశారు. ప్రముఖ నటి తాప్సి పన్ను తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఫోటో సామాజిక మాద్యమంలో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఈశాన్య ఢిల్లీలోని బాబర్‌పూర్‌లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి గుండోపోటుతో మరణించారు.

Tags:    

Similar News