షహీన్ బాగ్ ఆందోళనకారులను తొలగించిన పోలీసులు

న్యూఢిల్లీ: సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక ఆందోళనలకు కేరాఫ్ గా నిలిచిన ఢిల్లీలోని షహీన్ బాగ్ నిరసనకారులను పోలీసులు బలవంతంగా తొలగించారు. దీంతో 101 రోజులు నిరాఘాటంగా సాగిన షహీన్ బాగ్ ఆందోళనలకు ఈరోజు బ్రేక్ పడినట్లయింది. కరోనాను కట్టడి చేయడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత ఆందోళనలు విరమించుకోవాలని షహీన్ బాగ్ నిరసనకారులకు పోలీసులు సూచించారు. కానీ సామాజిక దూరాన్ని పాటిస్తూ కొనసాగిస్తామని ఆందోళనకారులు […]

Update: 2020-03-24 01:47 GMT

న్యూఢిల్లీ: సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక ఆందోళనలకు కేరాఫ్ గా నిలిచిన ఢిల్లీలోని షహీన్ బాగ్ నిరసనకారులను పోలీసులు బలవంతంగా తొలగించారు. దీంతో 101 రోజులు నిరాఘాటంగా సాగిన షహీన్ బాగ్ ఆందోళనలకు ఈరోజు బ్రేక్ పడినట్లయింది. కరోనాను కట్టడి చేయడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత ఆందోళనలు విరమించుకోవాలని షహీన్ బాగ్ నిరసనకారులకు పోలీసులు సూచించారు. కానీ సామాజిక దూరాన్ని పాటిస్తూ కొనసాగిస్తామని ఆందోళనకారులు తెలిపారు. కాగా మంగళవారం ఉదయం ఏడు గంటలకు పోలీసులు షహీన్ బాగ్ కు చేరారు. అక్కడి ఆందోళనకారులను బలవంతంగా తొలగించారు. ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags: Shaheenbagh, removed, protestors, anti caa, lockdown, delhi

Tags:    

Similar News