కోలుకున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం కుదట పడింది. ఆయన ఇటీల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మొదట రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరిన ఆయన, ఆరోగ్యం క్షీణించడంతో ఆపై మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్లాస్మా థెరపీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను సత్యేంద్ర శరీరంలోకి ఎక్కించారు. దీంతో ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం మంత్రి శరీరంలో యాంటీ బాడీలు […]

Update: 2020-06-21 22:00 GMT

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం కుదట పడింది. ఆయన ఇటీల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మొదట రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరిన ఆయన, ఆరోగ్యం క్షీణించడంతో ఆపై మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్లాస్మా థెరపీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను సత్యేంద్ర శరీరంలోకి ఎక్కించారు. దీంతో ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం మంత్రి శరీరంలో యాంటీ బాడీలు పెరిగి వైరస్‌ను నిరోధించాయి. మరో రెండు రోజుల్లో ఆయన్ను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలిస్తామని వైద్యులు వెల్లడించారు.

Tags:    

Similar News