తెలంగాణకు ఢిల్లీ ప్రభుత్వం విరాళం

దిశ, వెబ్‎డెస్క్ : హైద‌రాబాద్‎ను భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఈ నేప‌థ్యంలో నగర ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ త‌క్ష‌ణ సాయం కింద రూ. 550 కోట్లు విడుద‌ల చేశారు. ఆయా రాష్ర్ట ప్ర‌భుత్వాలు సైతం తెలంగాణ‌కు అండ‌గా నిలుస్తున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించ‌గా.. తాజాగా ఢిల్లీ ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. వరదలతో నష్టపోయిన తెలంగాణలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరపున […]

Update: 2020-10-20 01:35 GMT

దిశ, వెబ్‎డెస్క్ : హైద‌రాబాద్‎ను భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఈ నేప‌థ్యంలో నగర ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ త‌క్ష‌ణ సాయం కింద రూ. 550 కోట్లు విడుద‌ల చేశారు. ఆయా రాష్ర్ట ప్ర‌భుత్వాలు సైతం తెలంగాణ‌కు అండ‌గా నిలుస్తున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించ‌గా.. తాజాగా ఢిల్లీ ప్ర‌భుత్వం ముందుకొచ్చింది.

వరదలతో నష్టపోయిన తెలంగాణలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరపున రూ.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. తెలంగాణలో వరదలు బాధాకరమన్నారు కేజ్రీవాల్. కష్ట సమయంలో తెలంగాణకు ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News