ఢిల్లీలో మరోసారి భూకంపం

న్యూఢిల్లీ: దేశరాజధానిలో మరోసారి భూకంపం సంభవించింది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రజలు భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎటువంటి ట్రాఫిక్ లేకపోవడం.. భూకంపం కేంద్రం కూడా భూ ఉపరితలానికి సమీపంలోనే కేంద్రీకృతమవడంతో భూకంప తీవ్రత అధికంగా కనిపించిచంది. అయితే, దీనితో ఎటువంటి నష్టం జరగలేదు. సోమవారం మధ్యాహ్నం 1.26 గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.7గా నమోదైంది. భూమిలోపల ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్టు నేషనల్ సెంటర్ […]

Update: 2020-04-13 06:05 GMT

న్యూఢిల్లీ: దేశరాజధానిలో మరోసారి భూకంపం సంభవించింది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రజలు భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎటువంటి ట్రాఫిక్ లేకపోవడం.. భూకంపం కేంద్రం కూడా భూ ఉపరితలానికి సమీపంలోనే కేంద్రీకృతమవడంతో భూకంప తీవ్రత అధికంగా కనిపించిచంది. అయితే, దీనితో ఎటువంటి నష్టం జరగలేదు. సోమవారం మధ్యాహ్నం 1.26 గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.7గా నమోదైంది. భూమిలోపల ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సేస్మాలజీ పేర్కొంది.

ఢిల్లీలో రెండు రోజుల్లో ఇది రెండో భూకంపం. ఆదివారం కూడా ఢిల్లీలో 3.5 తీవ్రతతో భూమి కంపించింది.

tags: delhi, earth quake, second, tremors, richter scale

Tags:    

Similar News