డియర్ దీపికా… అభిమాని ప్రేమ లేఖ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే. కష్టాన్ని నమ్ముకుని ఎదిగిన వ్యక్తి. ఎన్నో సవాళ్ళను ఎదుర్కుని స్టార్ రేంజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. తన ప్రవర్తన, నటనతో స్టార్ హీరోలను, ముఖ్యంగా తన భర్త నే తన అభిమానిగా మలుచుకున్న దీపికా… ఎంతో మంది అభిమానులను సొంత చేసుకుంది. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ తనకు అభిమానులున్నారు. అలాంటి వారిలో ఓ వీరాభిమాని తనకు ప్రేమతో రాసిన లెటర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది దీపికా. డియర్ […]

Update: 2020-04-18 01:31 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే. కష్టాన్ని నమ్ముకుని ఎదిగిన వ్యక్తి. ఎన్నో సవాళ్ళను ఎదుర్కుని స్టార్ రేంజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. తన ప్రవర్తన, నటనతో స్టార్ హీరోలను, ముఖ్యంగా తన భర్త నే తన అభిమానిగా మలుచుకున్న దీపికా… ఎంతో మంది అభిమానులను సొంత చేసుకుంది. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ తనకు అభిమానులున్నారు. అలాంటి వారిలో ఓ వీరాభిమాని తనకు ప్రేమతో రాసిన లెటర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది దీపికా.

డియర్ దీపిక…

నీకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఈ నోట్. నువు నాకు స్ఫూర్తి. నా జీవితంలో జరిగిన కొన్ని గొప్ప విషయాలకు కారణం నువ్వే… నేను బాలీవుడ్ ను ఇష్టపడేందుకు కారణం కూడా నువ్వే… నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ చూసి చాలా థ్రిల్ అయ్యా. మీనమ్మగా మీరు మా కమ్యూనిటిని రెప్రజెంట్ చేయడంతో చాలా హాపీగా ఫీల్ అయ్యా. నీ వల్లే మా అమ్మతో డిప్రెషన్ గురించి మాట్లాడగలిగా. నా ఫేవరెట్ యాక్టర్స్ ను కనుగొంది కూడా మీ వల్లే( రామ్ లీలా లో దీపికా అండ్ రణ్ వీర్). నేను సింగపూర్ లో ఉంటున్నా… నీ సినిమాలు చూడడం వల్ల అన్ని ప్రాంతాలతో ప్రేమలో పడిపోయా (ముంబై టూ కోర్సిక). ఆ ప్రదేశాలను చుట్టుముట్టేస్తున్నా. మొత్తానికి నీ వల్ల నా లైఫ్ లోకి అడ్వెంచర్ ఎంటర్ అయింది. నా జీవితం అంతా చీకటి అనుకున్న టైంలో ఒక వెలుగులా వచ్చావ్.


Tags: Deepika Padukone, Bollywood, Fans, Fan moment, Letter

Tags:    

Similar News