Tokyo Olympic Games :నియంత్రణ కోల్పోయిన దీపికా కుమారి

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ 1 ఆర్చర్, ఒలింపిక్స్‌లో భారత ఆశా కిరణం దీపికా కుమారి శుక్రవారం ప్రారంభమైన మహిళల వ్యక్తిగత కర్వ్ విభాగం ర్యాంకింగ్ రౌండ్‌లో నిరాశా జనకమైన ప్రదర్శన చేసింది. తొలి అర్ద భాగంలో నాలుగో స్థానంలో నిలిచిన దీపిక.. పూర్తి రౌండ్ పూర్తయ్యే సరికి 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి  వచ్చింది. దీపికా కుమారి 663 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సాన్ 680 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీపికకు ప్రత్యర్థిగా […]

Update: 2021-07-22 23:46 GMT

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ 1 ఆర్చర్, ఒలింపిక్స్‌లో భారత ఆశా కిరణం దీపికా కుమారి శుక్రవారం ప్రారంభమైన మహిళల వ్యక్తిగత కర్వ్ విభాగం ర్యాంకింగ్ రౌండ్‌లో నిరాశా జనకమైన ప్రదర్శన చేసింది. తొలి అర్ద భాగంలో నాలుగో స్థానంలో నిలిచిన దీపిక.. పూర్తి రౌండ్ పూర్తయ్యే సరికి 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీపికా కుమారి 663 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సాన్ 680 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీపికకు ప్రత్యర్థిగా ఉన్న ఆన్ సాన్ ఏకంగా ఒలింపిక్స్ రికార్డు నమోదు చేయడం విశేషం. తర్వాత జరిగే ఎలిమినేషన్ రౌండ్‌లో దీపిక భూటాన్‌కు చెందిన కర్మతో తలపడనున్నది. ఈ నెల 27న రౌండాఫ్ 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ‘నా ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. కాస్త నియంత్రణ కోల్పోయినట్లు అనిపించింది. తర్వాతి రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని దీపిక చెప్పింది.

Tags:    

Similar News