స్మిత్ సంచలన నిర్ణయం.. డీకాక్ కెప్టెన్సీ తొలగింపు !

క్రికెట్ సౌత్ఆఫ్రికా (సీఎస్ఏ)కు పూర్తి స్థాయి డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన గ్రేమ్ స్మిత్ వెంటనే తన పని ప్రారంభించాడు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉన్న క్వింటన్ డీకాక్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాడు. ‘ఇకపై డీకాక్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే కెప్టెన్‌గా ఉంటాడని.. టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తామని’ స్మిత్ స్పష్టం చేశాడు. గతేడాది డుప్లెసిస్ టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను డీకాక్‌కు […]

Update: 2020-04-18 03:33 GMT

క్రికెట్ సౌత్ఆఫ్రికా (సీఎస్ఏ)కు పూర్తి స్థాయి డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన గ్రేమ్ స్మిత్ వెంటనే తన పని ప్రారంభించాడు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉన్న క్వింటన్ డీకాక్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాడు. ‘ఇకపై డీకాక్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే కెప్టెన్‌గా ఉంటాడని.. టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తామని’ స్మిత్ స్పష్టం చేశాడు. గతేడాది డుప్లెసిస్ టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను డీకాక్‌కు అప్పగించారు. కాగా, దక్షిణాఫ్రికా జట్టును మూడు ఫార్మాట్లలో నడిపిస్తున్నందున డీకాప్‌పై అదనపు భారం పడుతోందని.. అది అతని ఆటపై కూడా ప్రభావం చూపిస్తోందని స్మిత్ అభిప్రాయపడ్డాడు.

‘సుదీర్ఘ ఫార్మాట్‌కు వేరే కెప్టెన్‌ను నియమిస్తాం.. డీకాక్ నుంచి ఇంకా స్థిరమైన ప్రదర్శన కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌లు ఉన్నాయి. ఈ సమయంలో డీకాక్ పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని’ స్మిత్ చెప్పుకొచ్చాడు. కాగా, త్వరలో వెస్టిండీస్‌తో సిరీస్ ఉన్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఇద్దరు కెప్టెన్లతో ఆడుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. అంతే కాకుండా కరోనా కారణంగా అసలు ఆ సిరీస్ జరగడంపైనా అనుమానాలున్నాయి.

Tags : Decock, Graeme Smith, captaincy, burden, South Africa

Tags:    

Similar News