తండ్రి చనిపోయిన మరుసటి రోజే..

తండ్రి చనిపోయాడన్న బాధ వేధిస్తున్నా.. తనపై ఉన్నబాధ్యత గుర్తొచ్చింది. కన్నకొడుకుగా నిర్వర్తించాల్సిన బాధ్యత పూర్తి చేసి..రాష్ట్రం తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చేందుకు తండ్రి చనిపోయిన ఆ మరుసటి రోజే విధుల్లో చేరి దేశ, రాష్ట్ర ప్రజల మన్నలను అందుకున్నాడో ఐఏఎస్. అతడెవరో కాదు ఐఏఎస్ నికుంజాదల్. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఒరిస్సా గవర్నమెంట్ అతడిని నియమించింది. నియమించిన ఒక రోజు తర్వాతే తన తండ్రి మరణించినట్టు స్వస్థలం జైపూర్ నుంచి సోమవారం సమాచారం […]

Update: 2020-03-18 08:28 GMT

తండ్రి చనిపోయాడన్న బాధ వేధిస్తున్నా.. తనపై ఉన్నబాధ్యత గుర్తొచ్చింది. కన్నకొడుకుగా నిర్వర్తించాల్సిన బాధ్యత పూర్తి చేసి..రాష్ట్రం తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చేందుకు తండ్రి చనిపోయిన ఆ మరుసటి రోజే విధుల్లో చేరి దేశ, రాష్ట్ర ప్రజల మన్నలను అందుకున్నాడో ఐఏఎస్.
అతడెవరో కాదు ఐఏఎస్ నికుంజాదల్. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఒరిస్సా గవర్నమెంట్ అతడిని నియమించింది. నియమించిన ఒక రోజు తర్వాతే తన తండ్రి మరణించినట్టు స్వస్థలం జైపూర్ నుంచి సోమవారం సమాచారం వచ్చింది. కొడుకుగా తన బాధ్యతలు పూర్తి చేసి మరుసటి రోజే తన బాధ్యతల్లో చేరాడు. వృత్తిపట్ల అంకితభావం ప్రదర్శించిన నికుంజాదల్ ను నిజమైన హీరో అంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు.

Tags: carona virus, ias nikuj dhal, orissa, comments on social media

Tags:    

Similar News