కేసీఆర్ ప్రేమ ఫాంహౌజ్‌ చెట్లపైనే.. ప్రజలపై కాదు : శ్రవణ్

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తన ఫాంహోజ్‌లోని చెట్ల పైన ఉన్న ప్రజలపై లేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లో వచ్చిన వరదల కారణంగా నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారని గుర్తుచేశారు. కేంద్ర బృందం ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా సైంటిఫిక్‌గా వ్యవహరించలేదని శ్రావణ్ తప్పుబట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా డ్రామాలు ఆడుతున్నారని, కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. అదేవిధంగా వరదల్లో చనిపోయిన వారి లెక్కలను ప్రభుత్వం దాస్తోందన్నారు. […]

Update: 2020-10-24 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తన ఫాంహోజ్‌లోని చెట్ల పైన ఉన్న ప్రజలపై లేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లో వచ్చిన వరదల కారణంగా నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారని గుర్తుచేశారు. కేంద్ర బృందం ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా సైంటిఫిక్‌గా వ్యవహరించలేదని శ్రావణ్ తప్పుబట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా డ్రామాలు ఆడుతున్నారని, కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. అదేవిధంగా వరదల్లో చనిపోయిన వారి లెక్కలను ప్రభుత్వం దాస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఏరియల్ సర్వే చేసే సమయం కూడా లేదా? అని శ్రావణ్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు తన ఫాంహౌస్‌‌లోని చెట్లపై ఉన్న ప్రేమ వరద బాధితులపై లేదన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా మలుచుకుంటోందని శ్రవణ్‌ దుయ్యబట్టారు.

భారీవర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అపారమైన ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ఠ నేతృత్వంలో అధికారుల బృందం వరద నష్టాన్ని అంచనా వేసింది. వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి జీహెచ్‌ఎంసీ అధికారులు అందించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News