డీఏ నిలుపుదల ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి

దిశ, హైదరాబాద్: జనవరి 2020 నుండి 2021 జూన్ వరకు ఉద్యోగుల డీఏను నిలుపుదల చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం వెనక్కి తీసుకోవాలని టీఎన్జీవో డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పిలుపు మేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో గురువారం అఖిల భారత నిరసన దినం పాటించారు. ఈ సందర్భంగా నాంపల్లి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అధ్యక్షత వహించిన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ […]

Update: 2020-06-04 08:20 GMT

దిశ, హైదరాబాద్: జనవరి 2020 నుండి 2021 జూన్ వరకు ఉద్యోగుల డీఏను నిలుపుదల చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం వెనక్కి తీసుకోవాలని టీఎన్జీవో డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పిలుపు మేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో గురువారం అఖిల భారత నిరసన దినం పాటించారు. ఈ సందర్భంగా నాంపల్లి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అధ్యక్షత వహించిన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం జారీ చేసిన డీఏ నిలుపుదల ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వీటి మూలంగా రాష్ర్టంలో పనిచేసే ఉద్యోగులకు డీఏ రాకుండా పోయిందన్నారు. కరువు భత్యం అనేది ఉద్యోగుల హక్కు అన్నారు. కొవిడ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు బీమా స్కీం కల్పించాలన్నారు.

Tags:    

Similar News