ప్రజెంట్ జర్నలిజం ఒక టాస్క్ : దత్తాత్రేయ

దిశ, ముషీరాబాద్: ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల స్థానం అత్యంత విలువైనదని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారని, క్షణాల్లో ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నారని అభినందించారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాక్టో) డైరీని ఆయన ఆవిష్కరించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ… ప్రస్తుతం జర్నలిజం ఒక టాస్క్ అన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టులే కీలకమని చెప్పారు. […]

Update: 2021-02-14 09:53 GMT

దిశ, ముషీరాబాద్: ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల స్థానం అత్యంత విలువైనదని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారని, క్షణాల్లో ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నారని అభినందించారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాక్టో) డైరీని ఆయన ఆవిష్కరించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ… ప్రస్తుతం జర్నలిజం ఒక టాస్క్ అన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టులే కీలకమని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులు అభినందనీయులన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, జాక్టో రాష్ట్ర అధ్యక్షుడు బాలస్వామి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు చిలుకూరి అఖిలేష్, జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News