బీహార్‌లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం

కరోనా విస్తరిస్తున్న వేళ దేశవ్యాప్తంగా పలు వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్‌లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన సహర్స పట్టణంలో చోటుచేసుకుంది. అసలే వైరస్ ధాటికి ప్రజలు గడప దాటి బయటకు రావడం లేదు. పట్టణంలో కొంత మంది అగంతకులు ఇళ్ల ముందు రూ.10, రూ.50, రూ.100 నోట్లను ఉంచారు. వీటితో పాటు ఓ కాగితాన్ని కూడా వదిలి వెళ్తున్నారు. అందులో ‘‘ నేను కరోనాతో వచ్చాను. […]

Update: 2020-04-12 22:05 GMT

కరోనా విస్తరిస్తున్న వేళ దేశవ్యాప్తంగా పలు వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్‌లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన సహర్స పట్టణంలో చోటుచేసుకుంది. అసలే వైరస్ ధాటికి ప్రజలు గడప దాటి బయటకు రావడం లేదు. పట్టణంలో కొంత మంది అగంతకులు ఇళ్ల ముందు రూ.10, రూ.50, రూ.100 నోట్లను ఉంచారు. వీటితో పాటు ఓ కాగితాన్ని కూడా వదిలి వెళ్తున్నారు. అందులో ‘‘ నేను కరోనాతో వచ్చాను. ఈ నోట్లను తీసుకోండి. లేకపోతే అందరినీ వేధిస్తాను ’’ అని కాగితంలో రాసి ఉంది. చీటిలో రాతను బట్టి ఇద్దంతా కావాలనే ఒకరు మాత్రమే చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నట్లు ఓ వ్యక్తి వెల్లడించాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు బీహార్ పోలీసులు తెలిపారు. కాగా, కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రీయంగా ఇప్పటి వరకు ఎలాంటి రుజువు కాలేదు.

Tags: currency notes, bihar, sahasra town, houses

Tags:    

Similar News