హెచ్‌ఐవీ గెలిచాడు.. కేన్సర్ ఓడించింది!

దిశ, వెబ్‌డెస్క్: ‘హెచ్‌ఐవీ సోకితే దానికి మందు లేదు, దాని నుంచి కోలుకోవడం కష్టం’ అనే మాటలను తిరగరాస్తూ తిమోతీ రే బ్రౌన్.. హెచ్‌ఐవీ నుంచి కోలుకుని ‘ద బెర్లిన్ పేషెంట్’గా చరిత్రకెక్కాడు. కానీ 54 ఏళ్ల వయసున్న తిమోతీ గతవారం చనిపోయాడు. చనిపోయింది హెచ్‌ఐవీ వల్ల కాదు, కేన్సర్ కారణంగా చనిపోయాడు. కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్‌లో బ్రౌన్ చనిపోయినట్లు ఆయన పార్టనర్ టిమ్ హోఫెన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. 2007, 2008లో మూలకణాల మార్పిడి […]

Update: 2020-10-04 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్:

‘హెచ్‌ఐవీ సోకితే దానికి మందు లేదు, దాని నుంచి కోలుకోవడం కష్టం’ అనే మాటలను తిరగరాస్తూ తిమోతీ రే బ్రౌన్.. హెచ్‌ఐవీ నుంచి కోలుకుని ‘ద బెర్లిన్ పేషెంట్’గా చరిత్రకెక్కాడు. కానీ 54 ఏళ్ల వయసున్న తిమోతీ గతవారం చనిపోయాడు. చనిపోయింది హెచ్‌ఐవీ వల్ల కాదు, కేన్సర్ కారణంగా చనిపోయాడు. కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్‌లో బ్రౌన్ చనిపోయినట్లు ఆయన పార్టనర్ టిమ్ హోఫెన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. 2007, 2008లో మూలకణాల మార్పిడి ద్వారా అప్పటికే ఉన్న లుకేమియా, హెచ్‌ఐవీల నుంచి తిమోతీ బయటపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తూ, లుకేమియా తిరిగి రావడంతో తిమోతీ చనిపోయాడు.

బ్రౌన్ చనిపోవడం గురించి అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీ వారు ఒక పరామర్శ ప్రకటన జారీ చేశారు. హెచ్‌ఐవీ సోకితే ఇక చనిపోవడమేనని, బతికే అవకాశాలు చాలా తక్కువ అని వ్యాధిగ్రస్తులందరూ భరోసా లేకుండా సతమతమవుతున్న సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ మహమ్మారి రోగం నుంచి బయటపడవచ్చని నిరూపించి, ఎందరిలోనో నమ్మకాన్ని, ఆశను నెలకొల్పిన తిమోతీ చనిపోవడం నిజంగా బాధాకరమని సొసైటీ వెల్లడించింది. లుకేమియా లాంటి రక్త కేన్సర్ రోగాలకు మూల కణాల మార్పిడి ద్వారా చికిత్స చేయవచ్చని తెలుసు కానీ, అదే ట్రీట్‌మెంట్‌తో హెచ్‌ఐవీని కూడా నయం చేయవచ్చని తిమోతీ విషయంలో నిరూపితమైంది. 2007లో ఒకసారి, మళ్లీ 2008లో ఒకసారి మూల కణాల మార్పిడి ద్వారా తిమోతీ, హెచ్‌ఐవీ నుంచి బయటపడ్డాడు.

Tags:    

Similar News