ఢిల్లీలో కాల్పుల కలకలం

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న సీఆర్పీఎఫ్‌ ఎస్సై తన పై అధికారిని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఢిల్లీలోని 61 లోధ్‌ ఎస్టేట్‌ ప్రాంతం కేంద్ర హోంశాఖ భవనంలో ఘటన జరిగింది. సీఆర్‌పీఎఫ్‌లో ఎస్సైగా పనిచేస్తున్న కర్నైల్‌ సింగ్‌, పై అధికారి, సహచరుడు దశరథ్‌ సింగ్‌ మధ్య […]

Update: 2020-07-25 05:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న సీఆర్పీఎఫ్‌ ఎస్సై తన పై అధికారిని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఢిల్లీలోని 61 లోధ్‌ ఎస్టేట్‌ ప్రాంతం కేంద్ర హోంశాఖ భవనంలో ఘటన జరిగింది. సీఆర్‌పీఎఫ్‌లో ఎస్సైగా పనిచేస్తున్న కర్నైల్‌ సింగ్‌, పై అధికారి, సహచరుడు దశరథ్‌ సింగ్‌ మధ్య వాగ్వివాదం జరగడమే కాల్పులకు దారితీసినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీశారు. ఇరువురి మృతదేహాలపైనా బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కాల్పులు జరిపిన కర్నైల్‌ సింగ్‌ కశ్మీర్‌లోని ఉదంపూర్‌కు చెందిన వారు కాగా.. ఇన్‌స్పెక్టర్‌ దశరథ్‌ సింగ్‌ హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిద్దరి మధ్య ఏ విషయంలో వాగ్వాదం జరిగిందో.. అసలు విషయాలను తెలుసుకొనేందుకు విచారణకు ఆదేశించినట్టు సీఆర్‌పీఎఫ్‌ అధికార ప్రతినిధి, డీఐజీ ఎం.దినకరన్‌ తెలిపారు. నివేదికలో వెలువడే అంశాల ఆధారంగా వివరాలు వెల్లడిస్తామన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News