రూ. 15 లక్షల 50 వేలతో ఉడాయించిన బ్యాంక్ అధికారి

బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తూ 15 లక్షల 50 వేల రూపాయల నగదును కాజేసి ఉడాయించిన ఘటన వలిగొండ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వలిగొండ బ్రాంచ్ లో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.

Update: 2024-04-17 15:03 GMT

దిశ, వలిగొండ : బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తూ 15 లక్షల 50 వేల రూపాయల నగదును కాజేసి ఉడాయించిన ఘటన వలిగొండ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్రాంచ్ లో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్బీఐ వలిగొండ బ్రాంచ్ క్యాషియర్ గా పనిచేస్తున్న కాలేరు అనిల్ కుమార్ మంగళవారం ఉదయం 10 గంటలకు తన విధులకు హాజరై కొద్దిసేపు విధులను నిర్వహించి 11 గంటల సమయంలో బ్యాంక్ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బ్యాంక్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిన అనిల్ కుమార్

    ఎంతకు బ్యాంక్ కి రాకపోవడంతో బ్యాంక్ మేనేజర్ మౌనిక అతనికి ఫోన్ చేసింది. కానీ అనిల్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజన్ బ్యాంక్ సిబ్బందితో కలిసి క్యాష్ కౌంటర్ లోని క్యాష్ ని లెక్కించారు. 15 లక్షల 50 వేల రూపాయల క్యాష్ లెక్కకు రాలేదని, ఈమేరకు చోరీకి గురైట్లుగా తేలింది. బ్యాంక్ క్యాష్ తో ఉడాయించిన క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని 15 లక్షల 50 రూపాయలను రికవరీ చేయాలని బ్యాంక్ మేనేజర్ మౌనిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. మహేందర్ లాల్ తెలిపారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News