ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డి వ్య‌క్తి మృతి..

ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన తాడ్వాయి

Update: 2024-05-22 13:04 GMT

దిశ‌,ఏటూరునాగారం : ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలంలో చోటుచేసుకుంది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం, దామరతోగు గ్రామానికి చెందిన మొక్కటి రోహిత్ (26) గత కొన్నేళ్లుగా కుంజ బుజ్జి రాములు ఓనర్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దామర తోగు నుంచి ఓనర్ అత్తగారింటికి ముద్దుల గూడెం వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో కొడిశెల స‌మీపంలో చెక్కల వొర్రె వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దానిపై ఉన్న మరో వ్యక్తి దూకి వేయడంతో ఆయన క్షేమంగా ఉన్నాడు. డ్రైవర్ తల పై ట్రాక్టర్ బలంగా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఏటూర్ నాగారం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News