పరాయి స్త్రీతో సహజీవనంలో ఉన్నాడని కొమురవెల్లి ఎస్ఐ సస్పెన్షన్​

పరాయి స్త్రీతో సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురవెల్లి ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగరాజు తో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

Update: 2024-05-22 14:24 GMT

దిశ, కొమురవెల్లి : పరాయి స్త్రీతో సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురవెల్లి ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగరాజు తో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు,

    కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురూ తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా ఇతర మహిళలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో పాటు ఎస్ ఐ నాగరాజు భార్య తన పిల్లల కోసం కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నా చేసినట్లుగా వివిధ మీడియా మద్యమాల్లో ప్రచారం కావడంతో ఈ సంఘటన పై సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కావడంతో ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. 

Similar News