పోలీసులకు చిక్కిన కిలాడి లేడీ

కోదాడ బస్ స్టాండ్ లో గత నెల 18న మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మహిళ నుండి రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దొంగతనం చేసిన కేసులో నిందితురాలిని కోదాడ పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-05-22 13:55 GMT

దిశ, కోదాడ : కోదాడ బస్ స్టాండ్ లో గత నెల 18న మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మహిళ నుండి రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దొంగతనం చేసిన కేసులో నిందితురాలిని కోదాడ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని గోల్డ్ షాప్ బజార్ లో ఈ మహిళ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన పేరు కర్రెద్దుల లలిత అని, నెల్లూరు జిల్లా కావాలి మండలం బుడంగుంట అని తెలిపింది.

     ఆమె బస్ స్టేషన్ లో దొంగిలించిన బంగారు ఆభరణాలు ఒక చంద్రహారం, రెండు జతల చెవి దిద్దులు, ఒక ముక్కు పుడక, ఒక బంగారు ఉంగరం ( సుమారు 6 తులాలు ) రూ. 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 50కి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా ఆమె పలుమార్లు జైలు శిక్ష అనుభవించిదని ఎస్ఐ తెలిపారు. నిందితురాలి అరెస్టులో కీలకంగా వ్యవహరించిన కోదాడ పట్టణ ఎస్​ఐ రంజిత్ రెడ్డి, సిబ్బంది సతీష్నాయుడు, ఎల్లారెడ్డి తదితరులను కోదాడ టౌన్ సీఐ రాము అభినందించారు.

Similar News