HYD : తుక్కుగూడలో భారీ అగ్ని ప్రమాదం..

తుక్కుగూడలోని హార్డ్ వేర్ పార్క్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Update: 2024-05-25 05:03 GMT

దిశ, బడంగ్ పేట్ : తుక్కుగూడలోని హార్డ్ వేర్ పార్క్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ హార్డ్‌వేర్ పార్క్ కంపెనీలోని ఒకటవ నెంబర్ యూనిట్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసి పడుతుండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అందులో పనిచేసే సిబ్బంది ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సిబ్బందిని బయటికి పంపించడానికి సెక్యూరిటీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పహాడి షరీఫ్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News