తిరుమల అడవుల్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

తిరుమల శేషాచలం అడవుల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-04-19 09:21 GMT

దిశ, తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫార్వేట్ మండపం సమీపంలో శ్రీగంధం ప్లాంట్ లో మరియు అన్నమయ్య కాలిబాట‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కొండల్లోని వందల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకి వచ్చిన అటవీ శాఖ తో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టమైన కమ్ముకోవడంతో పచ్చని అటవీ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లింది. కాగా ఎర్ర చందనం స్మగ్లర్లు అడవికి నిప్పు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆకతాయిల చర్య లేక ప్రమాదవశాత్తూ ప్రమాదం జరిగిందా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు, రెండు వాటర్ ట్యాంకులను టీడీపీ అధికారులు ఏర్పాటు చేశారు.

Read More..

తెలంగాణ Vs ఏపీ.. మరోసారి భగ్గుమన్న కృష్ణా జలాల వివాదం 

Tags:    

Similar News