నిషేధిత పత్తి విత్తనాల ముఠా పట్టివేత

ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆటోను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు, శంకర్పల్లి పోలీసులు కలిసి పట్టుకున్నారు.

Update: 2024-05-22 13:16 GMT

దిశ, శంకర్పల్లి : ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆటోను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు, శంకర్పల్లి పోలీసులు కలిసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఎలిమెలకు చెందిన శివశంకర్ రావు, శంకర్పల్లి మండలం ఎలవర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, శంకర్పల్లి కి చెందిన ఉదయ్​కిరణ్, హరిబాబు అనే నలుగురు వ్యక్తులు కలిసి కర్నూలు జిల్లా శ్రీనివాసరావుని కలిశారు. ఆయన వద్ద ఉన్న ప్రభుత్వం నిషేధించిన పత్తి రకం ( బిజీ ఐ ఐ ఐ / హెచ్ టి )ని

     కిలో రూ.2500 చొప్పున 240 కిలోలు రూ. 6 లక్షలతో కొనుగోలు చేసి ఆటోలో తరలిస్తుండగా శంకర్పల్లి మండలం ఎలవర్తి గ్రామ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్ఓటీ, శంకర్పల్లి పోలీసులు పట్టుకొని ఆటోను, నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 240 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను, ఒక మొబైల్ ఫోన్, రూ. 2500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ తో పాటు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న శివశంకరరావు, శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్ కిరణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకోగా వాటిని పంపిణీ చేసిన శ్రీనివాసరావు, హరిబాబు అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News